![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -764 లో.. రిషి, వసుధారల ఎంగేజ్ మెంట్ కి దేవయాని, శైలేంద్ర కలిసి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత రిషి, వసుధార దండలు మార్చుకుంటారు. అలా దండలు మార్చుకోగానే.. ఇప్పుడే అవ్వలేదు, ఇంకా ఉందని శైలేంద్ర అనుకుంటాడు.
కాసేపటికి దేవయానికి జ్యూస్ తీసుకురమ్మని శైలేంద్ర చెప్తాడు. అలా దేవయాని వెళ్తుండగా.. ధరణిని వెళ్ళి చూడమని సైగ చేస్తుంది జగతి. అలా ధరణి వెళ్ళి చూసేసరికి.. దేవయాని మ్యాంగో జ్యూస్ లో విషం కలుపుతుంది. అది ధరణి చూసేస్తుంది. ధరణి అలా విషం కలపడం చూడటంతో.. తనని ఎవరికి చెప్పొద్దని దేవయాని బెదిరిస్తుంది. ఆ తర్వాత ధరణి వచ్చి జగతికి చెప్తుంది.
వెంటనే ఆ జ్యూస్ రిషి తాగినట్టు, అలా తాగి పడిపోయినట్టుగా కల కని గట్టిగా అరుస్తుంది జగతి. దాంతో అందరూ ఒక్కసారిగా జగతి వైపుకి చూస్తారు. ఏదో అనుకొని పిన్ని అలా అరిచేసింది. ఏమనుకోకండని అందరికి చెప్పి జగతిని చూసుకోమని మహేంద్రకి చెప్తాడు శైలేంద్ర. కాసేపటికి మ్యాంగో జ్యూస్ తో దేవయాని వస్తుంది. దాన్ని వసుధారకి ఇచ్చి రిషికి తాగించమంటాడు శైలేంద్ర. అది చూసిన జగతి.. వద్దు రిషి తాగొద్దు. అందులో విషం కలిసిందని అంటుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. ఇక శైలేంద్ర తన మాస్టర్ ప్లాన్ ని అమలు చేస్తాడు.
శైలేంద్ర ఆ మ్యాంగో గ్లాస్ ని తీసుకుంటాడు. ఏంటి పిన్ని మీరు నన్ను, మా అమ్మని అనుమానిస్తున్నారా? ఈ జ్యూస్ లో విషం కలిపి రిషికి ఇద్దామనుకున్నామా? అయితే సరే నేను తాగి మీరు అనుకున్నది అబద్ధమని నిరూపిస్తానని చెప్పిన శైలేంద్ర తాగేస్తాడు. నార్మల్ గా ఉండటంతో శైలేంద్ర చెప్పిందే రిషి నమ్ముతాడు. శైలేంద్ర మాస్టర్ ప్లాన్ ని తెలుసుకోని రిషి.. జగతిని అపార్థం చేసుకుంటాడు. తనని దూషిస్తాడు. మధ్యలో వసుధార కలుగజేసుకొని దేవయాని, శైలేంద్రలకి క్షమించమని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |